మనో స్థైర్యం స్తంభించింది
ఆత్మ విశ్వాసం ఊగిసలాడింది
నేను నేనుగా లేననిపించింది
చనిపోతానేమోనని అనిపించింది .
భూమి బద్దలైనదా ?
లేక ప్రళయం నర్తించుచున్నదా ?
నాతో నేనే పోరాడనా ?
ఈ గోషను మరణిస్తూనే జీవించనా ?
అవధులు దాటినా ఆవేశం
తికమక పెట్టే ఆక్రోశం
ఏమి చేయలేని ఒంటరితనం
ఈ "చెవి పోటు"కు లేదా ఉపసమనం ?